61 ఏళ్ల రోగికి కంబైన్డ్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ | - | Sakshi
Sakshi News home page

61 ఏళ్ల రోగికి కంబైన్డ్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ

Jun 13 2025 5:21 AM | Updated on Jun 13 2025 5:21 AM

61 ఏళ్ల రోగికి కంబైన్డ్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ

61 ఏళ్ల రోగికి కంబైన్డ్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ

సాక్షి, చైన్నె : ముంబైకు చెందిన 61 ఏళ్ల రోగికి చైన్నె లో కంబైన్డ్‌ ఓపెన్‌ హార్ట్‌ వాల్వ్‌ రీ ప్లేస్‌ మెంట్‌, టీఏవీఆర్‌ వాల్వ్‌– స్పెషలైజ్డ్‌ అయోర్టిక్‌ గ్రాఫ్ట్‌ శస్త్రచికిత్స ను విజయవంతం చేశారు. సిమ్స్‌ ఆస్పత్రిలో జరిగి న ఈ శస్త్రచికిత్స గురించి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డి యాక్‌, అడ్వాన్స్‌డ్‌ అయోర్టిక్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీవీ భాషి గురువారం మీడియాకు వివరించారు. గతంలో బెంటాల్‌ విధానాన్ని అనుసరించి పునరావృత శస్త్రచికిత్స చేయించుకున్న ఈ రోగికి ప్రస్తుతం టీఏవీఆర్‌, ఎఫ్‌ఈటీలు ఒకేసారిగా నిర్వహించామ ని తెలిపారు. పది గంటల మారథాన్‌ హై బ్రిడ్‌ సర్జరీగా 4 గంటలకు పైగా గుండె, ఊపిరితిత్తు ల బై పాస్‌, గుండె రెండు గంటలు ఆగినట్టుగా శస్త్రచికిత్సల దశలను సులభతరంగా పూర్తి చేశామన్నారు. శస్త్రచికిత్సలో ఎలాంటి సమస్యలులేవని, రెండు రో జులు ఐసీయూలో ఉన్న తర్వాత ఎనిమిది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్య వంతుడైనట్టు తెలిపారు. కార్డియోథొరాసిక్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ ఇ ద్రీస్‌, సిమ్స్‌ చైర్మన్‌ రవి పచ్చముత్తు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement