వందేళ్ల బామ్మకు జన్మదిన వేడుకలు
తిరువళ్లూరు: వందేళ్లు దాటిన వృద్ధురాలికి కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామానికి చెందిన పొట్టెమ్మ(100). ఈమె భర్త జగన్నాథం. వీరికి 1925వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి దయాళం, జయమణి, పన్నీరు, శేఖర్, కస్తూరి, విజయన్, కృభా కరన్, చిత్ర తదితర 8 మంది సంతానం. వీరిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. జగన్నాథం గత 2019లో మృతి చెందారు. పొట్టెమ్మ నాలుగు తరాలుగా కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల తో సహా మొత్తం 50 మందికి పైగా బంధువులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో పొట్టెమ్మకు వందేళ్లు దాటిన క్రమంలో ఆమె జన్మదిన వేడుకలను ఆదివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధురాలిని గ్రామంలో ఊరేగించి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వృద్ధురాలితో గ్రూపు ఫొటో దిగారు.
మూడుతరాలతో వృద్ధురాలికి..
కొరుక్కుపేట: కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు మనవరాళ్ల ఇలా మూ డు తరాల వారసులతో కలసి ఓ వృద్ధురాలు 100వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. తంజా వూరు జిల్లా పాపనాశంశెట్టి వీధిలో డేవిడ్ నివసించారు. ఆయన కూరగాయలు, బియ్యం దుకాణం నడుపుతుండేవారు. 1925లో శివగంగై జిల్లాలోని సరుగాలిలో జన్మించిన రాజమణిని 1941లో వివా హం చేసుకున్నారు. వివాహం తర్వాత రాజ మణి తన భర్తతో కలసి పాపనాశంలో నివశించేది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలున్నారు. భర్త మరణించిన తరువాత రాజమణి ఆ దుకాణాన్ని చూసుకుంది. రాజమణి కుటుంబంలో 107 మంది ఉన్నారు. ఈ పరిస్థితిలో వృద్ధురాలు రాజమణికి 100 ఏళ్లు నిండాయి. దీంతో ఆదివారం రాజమణి తన 100వ పుట్టిన రోజును జరుపుకుంది. 107 మందితో కూడిన మూడు తరాల వారు పాల్గొని, ఎంతో ఘనంగా పుట్టిన రోజు జరిపించారు. డప్పులు, మంగళవాయిద్యాలు వాయిస్తూ టపాసులు పేల్చి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి విందు ఏర్పాటు చేసి సంబరంగా జరుపుకున్నారు. అందరూ రాజమణికి బహుమతులు అందించి, శాలువాలు కప్పి, స్వీట్లు అందజేసి ఆమె ఆశీస్సులు పొందారు. వృద్ధురాలి దీర్ఘాయువు రహస్యం గురించి ఆమె కుమారుడు జెబాస్టిన్ ఆనందన్ మాట్లాడుతూ తన అమ్మకు మాంసాహారం తినడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆమె అనారోగ్యం కారణంగా ఎప్పుడూ ఆస్పత్రికి వెళ్లలేదన్నారు. ఎల్లప్పు డూ సంతోషంగా ఉంటారు. తన రోజువారీ కార్యక్రమాలను తానే చేసుకుంటారని చెప్పారు.
వందేళ్ల బామ్మకు జన్మదిన వేడుకలు


