వేడుకగా పెరియ మారియమ్మన్ ఉత్సవాలు
సేలం: ఈరోడ్‌లో శనివారం పెరియ మారియమ్మన్ దేవాలయంలో స్తంభం లాగడం, పసుపు స్నానం చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా పెరియ మారియమ్మన్ సోదరీమణులు చిన్న మారియమ్మన్, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయాలు ఈరోడ్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాలలో వార్షికోత్సవం సందర్భంగా రథోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం పండుగ గత నెల 18న పుష్పయాగంతో ప్రారంభమైంది. తదనంతరం గత నెల 22వ తేదీ రాత్రి మూడు ఆలయాల్లో స్తంభాలను నాటారు. ఈ స్తంభాలకు చుట్టు పక్క గ్రామాల ప్రజలు ప్రతిరోజు కావేరి నది నుంచి పాల కూజాలు, తీర్థ కూజాలను ఊరేగింపుగా తీసుకుని మూడు దేవాలయాలలోని స్తంభాలపై పవిత్ర జలాన్ని పోసి ముగ్గురు దేవతలను పూజిస్తారు. ఈ పండుగ చివరి ఘట్టమైన పెరియ మారియమ్మన్, చిన్న మారియమ్మన్, కరైవాక్కల్ మారియమ్మన్ స్తంభం ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు ఆలయాల్లో నాటిన స్తంభాలను కూల్చివేసి సంబంధిత ఆలయ పూజారులు స్తంభాలను భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఆలయ స్తంభాన్ని పన్నీర్‌సెల్వం పార్కు ద్వారా, చిన్న మారియమ్మన్ ఆలయ స్తంభాన్ని అగ్రహారం రోడ్డు ద్వారా, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయ స్తంభాన్ని కచేరి రోడ్డు ద్వారా విడివిడిగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. మూడు స్తంభాలను క్లాక్ టవర్ ప్రాంతంలో ఒకే చోట చేర్చారు. తరువాత క్లాక్ టవర్, పెరియార్ రోడ్, మరపాలెం మండపం రోడ్, ఆర్కెని మీదుగా పట్టణ పోలీసు స్టేషన్, అగ్రహారం రోడ్డు మీదుగా రాత్రి కార్ల డ్రెయిస్‌కు చేరుకుని మూడు ఆలయాల స్థంభాలను కాలువోనే వదిలేశారు.
పసుపు స్నానం: పెరియ మారియమ్మన్ ఆలయం, చిన్న మారియమ్మన్ ఆలయం, కరైవాక్కల్ మారియమ్మన్ ఆలయాల్లో నాటి స్తంభాలను పెకలించిబడిన తరువాత ఈరోడ్ నగరం, పరిసర ప్రాంతాలలో పసుపు స్నాన వేడుక జరిగింది. స్నాన మాచరించిన తరువాత పెళ్లి అయిన మహిళలు తన తాళి దారం మార్చుకున్నారు.
వేడుకగా పెరియ మారియమ్మన్ ఉత్సవాలు
వేడుకగా పెరియ మారియమ్మన్ ఉత్సవాలు


