కార్ల్‌మార్క్స్‌కు చైన్నెలో విగ్రహం | - | Sakshi
Sakshi News home page

కార్ల్‌మార్క్స్‌కు చైన్నెలో విగ్రహం

Apr 4 2025 2:09 AM | Updated on Apr 4 2025 2:09 AM

కార్ల

కార్ల్‌మార్క్స్‌కు చైన్నెలో విగ్రహం

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ గురువారం తమిళనాడు అసెంబ్లీ వేదికగా డీఎంకే కూటమి సభ్యులతో పాటూ మరికొన్ని పార్టీల సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా నినాదాలు మార్మోగించారు. కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా చట్ట పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, నల్ల బ్యాడ్జీలను ధరించేందుకు అన్నాడీఎంకే సభ్యులు నిరాకరించగా, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీ ధరించి ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్‌

తమిళనాడు శాసనసభలో, సీఎం స్టాలిన్‌ అసెంబ్లీ నిబంధనలు 110 ప్రకారం ప్రత్యేక ప్రకటన చేశారు. జర్మనీ తత్వవేత్త, సోషలిస్టు నేత, కమ్యూనిజం రూపకర్త కార్ల్‌మార్క్స్‌ గురించి ఈ ప్రకటన చేస్తూ, సభ్యుల చేత కరతాళ ధ్వనులను మార్మోగించారు. తత్వశాస్త్రాన్ని కనుగొన్న విప్లవకారుడు కార్ల్‌ మార్క్స్‌ జీవితం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ చరిత్రలో చాలా మంది జన్మించారని, అయితే, చరిత్రకు చాలా మంది దోహదపడ్డారని గుర్తు చేశారు. ప్రపంచ విప్లవాలకు, సాధించిన వివిధ విజయాలకు కార్ల్‌ మార్క్స్‌ నివేదికను వివరిస్తూ మార్చి 14వ తేదీన ఆయన స్మారక దినోత్సవం అని గుర్తు చేశారు. గొప్ప మేధావి కార్ల్‌ మార్క్స్‌ విగ్రహాన్ని తమిళనాడు రాజధాని చైన్నెలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు మూకయ్యదేవర్‌కు మదురై జిల్లా ఉసిలం పట్టిలో మణి మండపం ఏర్పాటు చేయనున్నామని సభలో ప్రకటించారు.

కోర్టును ఆశ్రయించేందుకు అసెంబ్లీ వేదికగా నిర్ణయం

వక్ఫ్‌ సవరణకు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదం

కేంద్రంపై డీఎంకే కూటమి ఆగ్రహం

నల్లబ్యాడీలతో సభకు సభ్యులు

అన్నాడీఎంకే నిరాకరణ

బీజేపీ వాకౌట్‌

కార్ల్‌మార్క్స్‌కు చైన్నెలో విగ్రహం 1
1/1

కార్ల్‌మార్క్స్‌కు చైన్నెలో విగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement