ముగిసిన ఆస్తిపన్ను గడువు
● ఒక్క శాతం జారిమానాతో వసూలుకు నిర్ణయం
సాక్షి, చైన్నె: చైన్నెలో ఆస్తి పన్ను వసూళ్ల గడువు సోమవారంతో ముగిసింది. ఇక, మంగళవారం నుంచి ఒక్క శాతం జరిమానతో వసూలు చేయనున్నారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో 13 లక్షల మేరకు గృహాల నుంచి ఆస్తిపన్నును ఏటా వసూలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి ఈ మొత్తాన్ని ఇంటి యజమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.2 వేల కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిని చెల్లించకుండా ఏళ్ల తరబడి బకాయిలు పెడుతూ వస్తున్న వారూ ఎక్కువే. వీరి భరతం పట్టే విధంగా తరచూ చైన్నె కార్పొరేషన్ వర్గాలు దూకుడు పెంచడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో 2024–25 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడవు సోమవారంతో ముగిసింది. రంజాన్ సెలవు రోజైనప్పటికీ, ఆస్తిపన్ను వసూళ్ల కోసం అన్ని మండల కార్యాలయాలలో రెవెన్యూ విభాగాలు పనిచేశాయి. గడువు ముగియడంతో మంగళవారం నుంచి చెల్లించాల్సిన ఆస్తిపన్ను నుంచి ఒక్క శాతం జరిమానతో వసూలు చేయాలని నిర్ణయించారు. ఇందులోనూ జాప్యం చేసిన పక్షంలో జరిమాన శాతం మరో వారం తర్వాత పెంపునకు కార్పొరేషన్ అధికారులు పరిశీలన చేస్తున్నారు.
పక్షులను రక్షించుకుందాం!
● సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: పక్షులను రక్షించుకుంద్దామని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. జనం విలవిల లాడుతున్నారు. ఓ వైపు కొన్ని చోట్ల అకాల వర్షం పలకరింపు , మరో చోటభానుడి ఉగ్ర రూపం వెరసి జన జీవనం పిప్పి అవుతోంది. ఎండ నుంచి ఉపశమనం కోసం చైన్నె వంటి నగరాలలో బీచ్‌ల వైపుగా సాయంత్రం వేళ జనం పరుగులు తీస్తున్నారు. ఎండ దాటికి పక్షలు సైతం విల విలాడుతున్నాయి. చైన్నెతో పాటుగా పలు నగరాలలో ఉన్న జంతు ప్రదర్శన శాలలోని జంతువులు, పక్షులను ఎండ వేడి నుంచి రక్షించే విధంగా వాటర్ స్ప్రే చేస్తున్నారు. అయితే అనేక చోట్ల చెట్ల మీద ఉండే పక్షులు నీటి కోసం అలమటించే పరిస్థితులు తప్పడం లేదు. దీనిని పరిగణించిన సీఎం స్టాలిన్ పక్షులను రక్షించుకుందామని పిలుపు నిస్తూ ఎక్స్ పేజిలో ట్వీట్ చేశారు. పక్షులకు తన ఇంటి డాబా పైన ఆహారం, నీళ్లు పెడుతున్నట్టుగా కొన్ని ఫొటోలను పొందు పరిచారు. ఎండల క్రమంగా పెరుగుతున్నాయని, పక్షులను రక్షించుకుంద్దాం. ఇళ్ల వద్ద డాబాలపై వాటి కోసం నీరు, ఆహారం ఉంచుదాం అని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ ఆదివారం రాత్రి చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్రిజిల్ – ఇండియా ఆల్ స్టార్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి ప్రస్తావించారు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను గర్తు చేస్తూ అందర్నీ అభినందించారు.
పళణి యానిమేషన్ ప్రచారం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళణి స్వామి యానిమేషన్ ద్వారా ప్రచార అంశాలను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన అనేక ఫొటోలు, కార్యక్రమాలను యానిమేషన్ చేసి ప్రజలలోకి పంపించే దిశగా అన్నాడీఎంకే వర్గాలు విస్తృత చర్యలు చేపట్టారు. 2026 ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ పార్టీ ఐటీ విభాగం ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేసింది. ప్రస్తుతం ఏఐ టె క్నాలజీ ద్వారా జుబ్లీ యానిమనేషన్ ప్రక్రియను ఉపయోగించుకోవడం వేగవంతమైంది. దీంతో ఈ ప్రక్రియ ద్వారా పళణి స్వామికి సంబంధించిన ముఖ్యమైన అనేక పోటోలు, కార్యక్రమాలు, ఆసక్తికర అంశాలు,ఘటనలకు సంబంధించి వాటిని యానిమేషన్ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి యామినేషన్‌తో జనాన్ని ఆకట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో కొన్ని యానిమేషన్ చేసిన ఫొటోలను పళణి స్వామి తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు.
ముగిసిన ఆస్తిపన్ను గడువు
ముగిసిన ఆస్తిపన్ను గడువు


