తిరువానలైకావల్ ఆలయంలో ఘనంగా రథోత్సవం
సేలం : తిరుచ్చి తిరువానైకావల్ జంబుకేశ్వరర్ ఆలయంలో పంగుణి రథోత్సవం ఆదివారం అతి వైభవంగా జరిగింది. పంచభూత క్షేత్రాలలో నీటి స్థావరంగా ప్రసిద్ధి చెందిన తిరుచ్చి తిరువానైకావల్ జంబుకేశ్వరర్ ఆలయంలో ఏటా పంగుణి మాస బ్రహ్మోత్సవాలు 48 రోజుల పాటూ ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు గత 8వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ప్రతి రోజు స్వామి, అమ్మవార్లు పలు రకాల వాహనాలలో ఊరేగారు. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టమైన రధోత్సవం ఆదివారం నిర్వహించారు. ఉత్సవ మండపంలో స్వామి వారికి విశేష అభిషేకాలు ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. తర్వాత పెద్ద రథంపై జంబుకేశ్వరర్ స్వామి, మరో రథంపై అకిలాండేశ్వరి అమ్మవారిని అధిరోహింపజేశారు. తర్వాత భక్తులు నమః శివాయ నామస్మరణతో రథాన్ని పుర వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
తిరువానలైకావల్ ఆలయంలో ఘనంగా రథోత్సవం


