రోడ్డు పనులపై వివాదం.. గోల్‌తండాలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులపై వివాదం.. గోల్‌తండాలో ఉద్రిక్తత

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

అనంతగిరి : మండలంలోని కొత్తగోల్‌తండా గ్రామంలోని రోడ్డు పనుల విషయంలో వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. మూడు నెలలుగా క్రితం గోల్‌తండాలోని 8వ వార్డులో రోడ్డును ఎత్తుగా నిర్మించడం వల్ల తనకు నష్టం జరుగుతుందంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. దీంతో ఆయన రోడ్డుపై పోసిన మట్టిని తరలించాలని పంచాయతీ రాజ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓ హరిసింగ్‌, ఎంపీఓ సుష్మా పోలీస్‌ ప్రొటక్షన్‌తో కొత్తగోల్‌తండాకు చేరుకుని రోడ్డుపై పోసిన మట్టిని తొలగింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ఉన్న మట్టిని తరలిస్తున్న జేసీబీని అడ్డుకున్నారు. కాగా తమ సొంత ఖర్చులతో, సొంత స్థలంలో సీసీ రోడ్డు వేసుకున్నామంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిత్తక నెలకొంది. మట్టి తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నంచిన వారిని పోలీసులు అదుపు చేశారు. అనంతరం అధికారులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్తామన్నారు. రోడ్డుపై మట్టి తరలింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం

ఉన్నతాధికారుల జోక్యంతో పనులు వాయిదా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement