కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది | - | Sakshi
Sakshi News home page

కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

సూర్యాపేట : అమర జవాన్‌ కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు త్యాగం మరువలేనిదని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. కల్నల్‌ సంతోష్‌ బాబు 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన సంతోష్‌ బాబు త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం కోసం పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నివేదిత, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, కల్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement