ఎస్టీపీ మృతుల కుటుంబాలకు సాయం | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీ మృతుల కుటుంబాలకు సాయం

Nov 27 2026 4:14 AM | Updated on Nov 27 2026 4:14 AM

నిజాంపేట: సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ మరణించిన జిల్లాకు చెందిన ముగ్గురు సఫాయి కర్మచారుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, పీఎం ఆవాస్‌ యోజన కింద సొంత ఇళ్లు మంజూరు చేయాలని, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ సభ్యులు కరం సింగ్‌ కర్మా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం షణ్ముఖరావు అలియాస్‌ సుమన్‌ (26), సురేష్‌ గజింగి (24), పవన్‌ (20) కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఘటనకు బాధ్యులైన ప్రైవేట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు/చైర్మన్‌ (రవి)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement