నష్టం | - | Sakshi
Sakshi News home page

నష్టం

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

రెండు రోజులు
రూ. కోట్లు

భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు

డాక్యుమెంట్‌ రైటర్ల ఆందోళనతో పడిపోయిన ఆదాయం

జీఓ విరమించుకోవాలి

రైటర్ల పొట్ట కొట్టే 396 జీఓ విరమించుకోవాలి. వందలాది సంవత్సరాలు చరిత్ర గల డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను తీసేయాలన్న నిర్ణయం సరికాదు. – ఎన్‌వీ కామేశ్వరరావు,

సీనియర్‌ దస్తావేజు లేఖరి, శ్రీకాకుళం

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం

డాక్యుమెంట్‌ రైటర్లు పెన్‌డౌన్‌ చేసిన రెండు రోజులు మోడల్‌ డాక్యుమెంట్‌ని వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. అధికారికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశాం. డాక్యుమెంట్‌ రైటర్లతో పనిలేకుండా ఇంటర్నెట్‌ సాయంతో డాక్యుమెంట్స్‌ తయారుచేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాం.

– బి.సంజీవయ్య, జిల్లా రిజిస్ట్రార్‌, శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చే శాఖల్లో అత్యంత కీలకమైనది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ. డాక్యుమెంట్‌ రైటర్లు, స్టాంప్‌ వెండర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. డాక్యుమెంట్‌ రైటర్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుండంతో మూడు రోజులుగా డాక్యుమెంట్‌ రైటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జీఓ 396ని తీసుకొచ్చి రోడ్డున పడేయడం సరికాదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)లను ఓ ప్రైవేటు ఏజె న్సీకి ఇచ్చి ఒక్కో డాక్యుమెంట్‌కి రూ.2వేలు ఇచ్చి తయారు చేయించుకునేందుకు ఓ పథకం పన్నార ని, చంద్రబాబు అనుచరులకే ఈ ఏజెన్సీలు అప్పగిస్తారని రైటర్లు ఆరోపిస్తున్నారు. 118 ఏళ్ల చరిత్ర ఉన్న డాక్యుమెంట్‌ రైటర్ల పొట్ట కొట్టే జీఓలు ఎందుకు తీసుకొస్తున్నారో తెలీడం లేదని డాక్యుమెంట్‌ రై టర్లు మండిపడుతున్నారు. జిల్లాలో 13 సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా డాక్యుమెంట్‌ రైట ర్లు, స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, రైటర్ల అసిస్టెంట్లు మొత్తంగా జిల్లాలో 600మందికి పైగా ఉంటారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి బతుకు రోడ్డున పడుతుంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఈ నెల 6, 7 తేదీల్లో డాక్యుమెంట్‌ పెన్‌డౌన్‌ చేశారు. దీంతో 6వ తేదీన రూ.21లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నారు. ముందురోజు స్లాట్‌లు బుక్‌చేసి, డాక్యుమెంట్లు తయారుచేసి ఉండడంతో రూ.21లక్షలు ఆదాయం అయినా వచ్చింది. సాధారణంగా అయితే రూ.కోటి వస్తుంది. 7వ తేదీన మాత్రం ఒక్క నరసన్నపేట సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో మాత్రమే రూ 3.98 లక్షలు ఆదా యం వచ్చింది. మిగిలిన 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సున్నా ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో సుమారు రూ.2కోట్లు వరకు ఆదాయానికి గండి పడింది. ఈ జీఓను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్‌ చేసి చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైటర్లు తెలిపారు. 10న కలెక్టర్‌ను కలుస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement