కేజీబీవీలో డయేరియా | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో డయేరియా

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

● శాలిహుండం కస్తూర్బా విద్యార్థినులకు అతిసారం

● గార పీహెచ్‌సీలో చికిత్స

గార: శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు డయేరియా సోకింది. బుధ, గురువారాల్లో మొత్తం 13 మంది డయేరియా బారిన పడ్డారు. ముందుగా బుధవారం ఉదయం ఆరుగురికి విరేచనాలు, ఒక విద్యార్థినికి వాంతులు రావడంతో కేజీబీవీ ఏఎన్‌ఎం కృష్ణవేణి వెంటనే గార పీహెచ్‌సీ వైద్యాధికారి పొంటూరు సోనియాకు సమాచారం అందించి చికిత్స ప్రారంభించారు. వి ద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న యాళ్ల జాహ్నవి (ముద్దాడ), సురాల మోక్షిత (నిజామాబాద్‌), నీలాపు హాసిని(నీలాపుపేట), గాబు కల్యాణి(గాబువానిపేట), ఎం.మోహిని (శ్రీకాకుళం), 10వ తరగతి విద్యార్థి ని గంటా ఛాయాదేవి (సిలగాం)లకు ఆస్ప త్రిలో చికిత్స అందజేశారు. గురువారం సాయంత్రానికి వీరి పరిస్థితి కుదుటపడింది. కుటుంబ సభ్యులు పీహెచ్‌సీ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్కూల్‌లోని బోరు నీటిని, ఆర్‌ఓ ప్లాంటులో నీటిని పరీక్ష జరిపారు. నీరు సురక్షితంగా ఉందని, భోజనం ద్వారా ఇబ్బంది ఏర్పడిందని పీహెచ్‌సీ వైద్యాధికారిణి పి.సోనియా తెలిపారు. సమస్య బయటపడినా బుధవారం మధ్యాహ్నం ఆహారంలో చికెన్‌ అందించారు. దీంతో సమస్య తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమా చారం తెలుసుకున్న సమగ్రశిక్ష సీఎంఓ శ్రీధర్‌ కేజీబీవీని సందర్శించారు. విద్యార్థినులు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలని గార పీహెచ్‌సీ వైద్యాధికారి సోనియా సూచించారు. ఆహార పదార్థాలు వేడిగా నాణ్యతగా ఉండాలన్నారు.

పీహెచ్‌సీలో విద్యార్థిని వద్ద తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement