యూరియా కొనుగోలు చేయాలంటే గుళికలు, నానో యూరియా, నానో డీఏపీతో పాటు పలు రకాల రసాయన ఎరువులు కొనుగోలు చేయాలని ప్రైవేట్ డీలర్లు ఒత్తిడి పెడుతున్నారు. డీలర్లు చెప్పినవి కొనుగోలు చేయకపోతే యూరియా ఇవ్వడం జరగదని తేల్చి చెప్పడంతో రైతు నెత్తిన అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కూలి ధరలు, విత్తనాల ధరలు పెరిగి రైతులు తీ వ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సచివాలయాల కు కూటమి ప్రభుత్వం ఎరువులు కేటాయించకుండా ప్రైవేట్ డీలర్లకు ఎరువులు కేటాయించడంతో మండలంలోని శివారు గ్రామాలైన ఆకులతంపర, అడ్డంగి, కడుముచ సోమరాజపురం, గొట్టిపల్లితో పాటు పలు గ్రామాల నుంచి 12 కిలోమీటర్ల దూరం వచ్చి ఎరువులు కొనాల్సి వస్తోంది.
–కొత్తూరు
అవస్థలు తప్పడం లేదు
గ్రామ సచివాలయాలకు ఎరువులు ఇవ్వకపోవడంతో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు వెళ్లాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా గుళికలు, నానో యూరియా, డీఏపీలు అంటగడుతున్నారు.
– పాపారావు, రైతు, ఆకులతంపర గ్రామం


