విధుల్లో చేరిన ఇంటర్‌ విద్య డీవీఈఓ | - | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన ఇంటర్‌ విద్య డీవీఈఓ

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా వృత్తివిద్యాధికారిగా రేగ సురేష్‌కుమార్‌ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆయన జిల్లా డీవీఈఓగా, ఆర్‌ఐఓగా పనిచేస్తుండగా అనారోగ్య కారణాలతో రెండు నెలల మెడికల్‌ లీవ్‌ పెట్టారు. దీంతో రెండు నెలలపాటు శ్రీకా కుళం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మొదలవలస కృష్ణవేణి పూర్తి అదనపు బాధ్యతలతో డీవీఈఓగా, ఆర్‌ఐఓగా పనిచేసి మెప్పించారు. రెండు నెలలు మెడికల్‌ లీవ్‌ అనంతరం రేగ సురేష్‌కుమార్‌ విధుల్లో చేరడంతో కృష్ణవేణి ఆయనకు బాధ్యతలు అప్ప జెప్పి.. ప్రిన్సిపాల్‌గా ఆమె పూర్తిస్థాయిలో విధుల్లో చేరారు.

‘77.21% డిజిటలైజేషన్‌ పూర్తి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో అత్యంత పారదర్శకంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ గురువారం పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదయ్యేలా చూడటం, అనర్హులు, మృతుల పేర్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జూలై 9వ తేదీ నాటికి జిల్లాలోని మొత్తం 2,358 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 14,65,075 ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిందని, ఇది 77.21 శాతంగా నమోదైందని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు డిజిటలైజేషన్‌ పురోగతి వివరాలను పార్టీల ప్రతినిధులకు సమర్పించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండియా, వైఎస్సార్‌ సీపీ నుంచి రౌతు శంకరరావు, టీడీపీ తరఫున పీఎంజే బాబు, సీపీఐ–ఎం తరఫున ఎం.గోవిందరాజులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తిరుమలరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలు, గూడెం, పాత్రునివలస, పెద్దపాడు, సింగుపురం తదితర పాఠశాలల్లో గురువారం ఏపీటీఎఫ్‌ బృంద సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వేసవి సెలవుల్లో బదిలీలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఆర్సీ కమిషన్‌ నియమించి ఉద్యోగ ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, ఇంత వరకు బకాయి ఉన్న ఐదు డీఏలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 13లోగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.ఎస్‌ ప్రసాదరావు, పి.లక్ష్మణరావు, దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డీఏ బకాయిలు, మూడేళ్ల నుంచి ఇవ్వని ఐఆర్‌లు వెంటనే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆయన గురువారం జిల్లాలోని ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షనర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 12న కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని జోన్‌ 1 ఉద్యోగులు, పెన్షనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ సమావేశంలో అంతా పాల్గొనాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి.రజనీకాంతారవు, చంద్రశేఖర్‌ (చందు), కాళీప్రసాదు, ఎం.సీతారామ మూర్తి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రాజు, శ్రీనివాసరావు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement