శ్రీకాకుళం రూరల్: కేంద్రియ విద్యాలయంలో మెరు గైన ఫలితాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాల ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చా రు. పీఎం కేంద్రియ విద్యాలయంలో గురువారం నిర్వహించిన విద్యాలయ నిర్వాహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణత, క్రీడాపోటీలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై ఆరా తీశారు. జేఈఈ, బిట్సాట్, ఎంసె ట్, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత వివరాలు అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య తనిఖీలు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. శ్రీకాకు ళం నుంచి కేంద్రియ విద్యాలయానికి ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, డీఈవో రవిబాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.అనిత తదితరులు పాల్గొన్నారు.


