మత్స్య, జీడి ఎగుమతులపై ఎఫెక్ట్..
జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తుల్లో జీడి పప్పు, మత్స్య సంపదది అగ్రస్థానం. జిల్లాలో 11 తీర మండలాల్లో 4 వేల హెక్టార్లలో చేపల ఆక్వా సాగు అవుతోంది. మన జిల్లాలో దొరి కే రొయ్యకు విదేశాల్లో గిరాకీ ఎక్కువ. ఇక్కడ కొనుగోలు చేసే రొయ్యను విశాఖ పోర్టుకు తరలించి అక్కడ నుంచి ఎగమతి చేస్తుంటారు. దుబాయ్, ఖతార్‌లో పోర్టులకు కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి యూరప్ దేశాలతో పాటు అమెరికాకు తరలి స్తుంటారు. అయితే ఇరాన్ సమీపంలో హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ఎక్కడి కంటైనర్లు అక్కడే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో చేపల విక్రయాలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లాలో రొయ్యల ధర తగ్గినట్టు తెలుస్తోంది. మత్స్యకారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు జీడిపప్పుది అదే పరిస్థితి. జిల్లా నుంచి జీడి పప్పు ఎగుమతి అవుతుంటుంది. విదేశాల నుంచి జీడి పిక్కలు దిగుమతి చేస్తారు. అయితే యుద్ధ ప్రభావంతో నౌకా రవాణా నిలిచిపోయింది. దీంతో పిక్కల దిగుమతి లేదు. జీడి పప్పు ఎగుమతి లేదు. దీంతో జీడి పప్పు ధరపై ప్రభా వం చూపే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో కొంత ఇబ్బందులు లేవు. యుద్ధం ఇలానే కొనసాగితే మాత్రం మనజిల్లాలో ప్రధాన జీవనాధారంగా నిలిచే మత్స్య, జీడి పరిశ్రమలు, రైతులపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


