ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

ప్రభు

ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం

పలాస ఆర్డీఓగా అప్పలరాజు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవ్వడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనుల వల్ల తాగునీరు కలుషితం అవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి గా విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలికొదిలేయడం వల్లే నేడు 65మందికిపైగా అమా యక ప్రజలు మంచాన పడ్డారని ఆయన ఆరో పించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై తమకు నమ్మకం లేదని మండిపడ్డారు. తక్షణ మే బాధితులందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు, కలుషిత నీరు సరఫరా కావడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అదుపులోనే అతిసారం : కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకి వీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్‌, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ముమ్మర చర్య లు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 52 కేసులు నమోదు కాగా, బాధితులను రిమ్స్‌, కిమ్స్‌, జెమ్స్‌ వంటి ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందారని, ఐదుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అతిసార నియంత్రణ చర్యలు పర్యవేక్షించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశు సంవర్ధక శాఖ జేడీలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. దమ్మలవీధిలో నాలు గు అంబులెన్స్‌లను నిరంతరం అందుబాటులో ఉంచామని, పరిస్థితి చక్కబడే వరకు వైద్య బృందాలు అక్కడే ఉండి సేవలు అందిస్తాయని స్పష్టం చేశారు. వ్యాధి నివారణకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చి తాగాలని కలెక్టర్‌ సూచించారు. మంగువారితోట, దమ్మలవీధి, గుడివీధి, కాకివీధి ప్రాంతాల్లో వైద్య, శానిటేషన్‌, ఇంజినీరింగ్‌, ప్లానింగ్‌ విభాగాలతో కూడిన సమన్వయ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అటు మున్సిపల్‌ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

కాగ్‌ కార్యాలయంలో గ్రూప్‌–1 అధికారిగా గెడ్డవూరు వాసి

మందస: భారత రాష్ట్రపతి ఆమోదంతో విడుదలైన అధికారిక ఉత్తర్వుల మేరకు మందస మండలం దున్నవూరు పంచాయతీ గెడ్డవూరు గ్రామం చెందిన వంక సురేష్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కార్యాలయంలో ఉన్నత గణాంకాధికారి(గ్రూప్‌–ఎ)గా పదోన్నతి పొందినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఒక్క టే అందరి జీవితాలను మార్చగలదని అన్నా రు. సురేష్‌ను కుటుంబ సభ్యులు,గ్రామపెద్దలు, ప్రజలు,స్నేహితులు అభినందించారు.

760 అక్రమ మద్యం సీసాలు డిస్పోజల్‌

ఆమదాలవలస: శ్రీకాకుళం ఎకై ్సజ్‌ డీఎస్పీ పి.రామచంద్రకుమార్‌ సమక్షంలో ఆమదాలవలస సివిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2022 నుంచి 2026 ఫిబ్రవరి 23 వరకు వివిధ కేసుల్లో పట్టుపడిన 760 అక్రమ మద్యం సీసాలను మంగళవారం ఆమదాలవలస పోలీస్‌ స్టేషన్‌లో డిస్పోజల్‌ చేసినట్లు డీఎస్పీ రామచంద్రకుమార్‌ తెలిపారు.

పలాస: పలాస ఆర్డీఓగా ఆర్‌.అప్పలరాజును పదోన్నతిపై నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. గతంలో ఇతను కోటబొమ్మాళి తహసీల్‌ద్రా్‌గా పనిచేశారు. పలాసలో ఇప్పటివరకు పనిచేసిన ఆర్డీఓ జి.వెంకటేష్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

ప్రభుత్వ వైఫల్యమే  డయేరియాకు కారణం 
1
1/1

ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement