ఎక్కడ చికిత్స అందజేస్తున్నారు..?
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు జెమ్స్, కిమ్స్, మెడికవర్, సిందూర, అప్సర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రత దృష్ట్యా ఆరు యూపీహెచ్‌సీలు, జెమ్స్, కిమ్స్, మెడికవర్ ఆస్పత్రులతో పాటు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
బాధితుల సంఖ్య..?
బాధితుల సంఖ్యను అధికారికంగా బయటపెట్టడం లేదు. దాదాపు 68 మందికిపైగా డయేరియా బారిన పడినట్లు సమాచారం. వీరిలో దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోగా, మానసిక పరిణితి లేని మోణింగి సంతోష్(41) కూడా అదే వాంతులు, విరే చనాలతోనే సోమవారం ఉదయం మరణించారు. మంగళవారం ఒక్కరోజే దమ్మల వీధికి చెందిన ఆటో డ్రైవర్ మండల సురేష్(41) రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోగా, సదాశివుని నర్సింగరావు(62) అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మార్గం మధ్యలో చనిపోయారు. వీరిలో ఆటో డ్రైవర్ సురేష్ ఆదాయమే ఆ కుటుంబానిక ఆధారం. ఆయన చనిపోవడం కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
ఎక్కడ చికిత్స అందజేస్తున్నారు..?


