బాధిత ప్రాంతాలు..?
నగరంలోని దమ్మల వీధి, కుమ్మరి వీధి, మేదరవీధి, కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, గోల్కొండ రేవు, మొండేటి వీధి, వాంబే కాలనీ, అరసవల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్‌బీఎస్ కాలనీల నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయి.
ఎక్కడ కలుషితం
జరిగి ఉండవచ్చు..?
నగరంలోని మేదరవీధి మెయిన్ రోడ్డు, కాలువలను పునర్నిర్మిస్తుండటంతో భూమి లోపల ఉండే వాటర్ పైప్‌లైన్‌లోకి కాలువ నీరు వెళ్లిపోవడం, మురుగునీటి కాలువల్లో తుప్పు పట్టిన పైపులైన్లు ఉండటం, వాటికున్న లీకుల ద్వారా మురుగునీరు పైపులైన్లలోకి వెళ్లడం వల్ల తాగునీరు కలుషితమైంది. ముఖ్యంగా కార్పొరేషన్ కార్యాలయం సర్వీసు ట్యాంక్ నుంచి ఏయే ప్రాంతాలకై తే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుందో ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కు వగా డయేరియా బారిన పడ్డారు.
బాధిత ప్రాంతాలు..?


