● అందుబాటులో ‘కంట్రోల్ రూమ్’
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని పలు వీధుల్లో అతిసారం ప్రబలిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడం, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించడం కోసం కలెక్టరేట్‌లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజ లు 08942–229080 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఎవరికై నా సహాయ, సహకారాలు కావాలన్నా ఈ నంబరు ద్వారా సంప్రదించవచ్చని ఆయన కోరారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన కాకి వీధి, దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట వాసులు మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చే నీటిని ప్రస్తుతానికి తాగవద్దని, పాత నీటిని పారబోయాలని తెలిపారు.


