ఆటోడ్రైవర్‌ నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

ఆటోడ్

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

కంచిలి: మండల కేంద్రం కంచిలికి చెందిన ఆటో డ్రైవర్‌ గుడియా దుదిష్టి సాహు తన నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో ప్రయాణించిన శకుంతల మజ్జి పొరపాటున మర్చిపోయిన బ్యాగును ఆమె అడ్రస్‌ కనుక్కొని అందించి ఆదర్శంగా నిలిచాడు. పోగొట్టుకున్న బ్యాగులోరెండు తులాల బంగారం, రూ.5వేలు నగదు ఉన్నాయి. మంగళవారం సోంపేట రైల్వేస్టేషన్‌లో ఆటో ఎక్కిన ఆమె తన స్వగ్రామం మజ్జిపుట్టుగకు వెళ్లింది. ప్రయాణ హడావిడిలో లగేజీని తనతో తీసుకెళ్లి, నగదు, బంగారం ఉన్న బ్యాగును మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్‌ సాహు బ్యాగును విడిచిపెట్టిన మహిళ అడ్రస్‌ను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చాడు. రూ.4లక్షలు విలువైన బంగాంర, నగదును తిరిగి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ను ఆమెతోపాటు గ్రామస్తులు, కంచమ్మతల్లి ఆటో యూనియన్‌ ప్రతినిధులు అభినందించారు.

మాజీ మంత్రులకు పరామర్శ

రణస్థలం: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ నేతృత్వంలోని పలువురు జిల్లా నాయకులు విజయవాడ, గుంటూరులలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై రౌడీ మూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, టెక్కలి, ఆమదాలవలస ఇన్‌చార్జిలు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, రణస్థలం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, నాయకులు లుకలాపు అనిల్‌, మంత్రి శ్రీనివాస్‌ ఉన్నారు.

ఆటోడ్రైవర్‌ నిజాయితీ 1
1/1

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement