అన్న ప్రసాదాల అవస్థలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

అన్న ప్రసాదాల అవస్థలు బంద్‌

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

అన్న

అన్న ప్రసాదాల అవస్థలు బంద్‌

● ‘సాక్షి’ కథనంపై స్పందించిన అధికారులు ● అరసవల్లిలో స్టీల్‌ బెంచీల ఏర్పాటుపై భక్తుల సంతృప్తి

● ‘సాక్షి’ కథనంపై స్పందించిన అధికారులు ● అరసవల్లిలో స్టీల్‌ బెంచీల ఏర్పాటుపై భక్తుల సంతృప్తి

అరసవల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన శాశ్వత నిత్యాన్నదాన భవనం కూల్చేసిన తర్వాత సుమారు రెండేళ్లుగా నేలపైనే భక్తులు అన్నప్రసాదాలను భుజించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవస్థలను కళ్లకు కట్టినట్లుగా ‘సాక్షి’లో ఈ నెల 16న ‘అపరిశుభ్రం..అవస్థల మయం..’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆలయ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. పరిశుభ్ర వాతావరణంలో అన్న ప్రసాదాలను అందించే దిశగా అడుగులు వేశారు. స్టీల్‌ బెంచీలు తయారు చేయించి నేలపై ప్రసాదాల భుజించే అవస్థలకు చెక్‌ పెట్టారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్న ప్రసాదాల అవస్థలు బంద్‌ 1
1/1

అన్న ప్రసాదాల అవస్థలు బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement