ఆకట్టుకున్న నాటిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న నాటిక పోటీలు

Feb 23 2026 9:41 AM | Updated on Feb 23 2026 9:41 AM

ఆకట్టుకున్న నాటిక పోటీలు

ఆకట్టుకున్న నాటిక పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: స్థానిక బాపూజీ కళా మందిర్‌లో శ్రీసుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవంలో భాగంగా ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు. గుంటూరు అభినయ ఆర్ట్స్‌ ఎన్‌.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించిన సమయం నాటిక, పొన్నూరుకు చెందిన శ్రీవిశ్వకళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో జీవీ మనోహర్‌ దర్శకత్వం వహించిన సూక్తం నాటిక ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్‌ శర్మ, గుత్తు చిన్నారావు, మండవల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, కె.సురేష్‌, కొంక్యాన మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయవాడలోని సంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ‘మమ్మల్ని బతకనివ్వండి’, విశాఖ కేవీ మెమోరియల్‌ ఆధ్వర్యంలో ‘నిన్ను నీవు గెలుచుకో’ నాటికలు సోమవారం ప్రదర్శింపబడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement