ఎవరిదీ పాపం..?
నాణ్యత లోపం..
పులిహోరలో కుళ్లిపోయిన శనగలు వస్తాయి.. నాణ్యత లేని జీడిపప్పులు పంటి కింద రాయిలా తగుతుంటాయి.. కారణమేంటా అని చూస్తే బ్లాక్‌లిస్టులో పెట్టిన ఏజెన్సీ నుంచి సరుకులు వస్తుంటాయి.. దిట్టం ప్రకారం వేయాల్సిన దినుసుల్లో లోపాలు కనిపిస్తాయి. అరసవల్లిలో జరుగుతున్న అపచారమిది. అంతా ‘అయిన వాళ్లే’ కావడంతో ఈ వైఖరిపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అధికారుల నుంచి నాయకుల వరకు అందరికీ నిజాలు తెలిసినా చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో నాణ్యత లేని పులిహోరనే ప్రసాదంగా భక్తులు కళ్లకద్దుకుంటున్నారు.


