● జయహో రాజమ్మ తల్లి.. | - | Sakshi
Sakshi News home page

● జయహో రాజమ్మ తల్లి..

Feb 23 2026 6:53 AM | Updated on Feb 23 2026 6:53 AM

● జయహో రాజమ్మ తల్లి..

● జయహో రాజమ్మ తల్లి..

త్తరాంధ్ర భక్తులకు కొంగుబంగారమైన వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి నాల్గో వారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో రాజమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటల్లోనూ, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జాము న నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలు ఆచరించారు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడే వంటలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మూడో వారం శివరాత్రి కావడంతో ఈ వారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. బీచ్‌ వద్ద మైరెన్‌ పోలీసులు గస్తీ నిర్వహించారు. –గార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement