‘పీఆర్‌సీని అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పీఆర్‌సీని అమలు చేయాలి’

Feb 23 2026 6:53 AM | Updated on Feb 23 2026 6:53 AM

‘పీఆర్‌సీని అమలు చేయాలి’

‘పీఆర్‌సీని అమలు చేయాలి’

ఇచ్ఛాపురం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే ఐఆర్‌ని ప్రకటించి పీఆర్‌సీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) డిమాండ్‌ చేసింది. స్థానిక మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆపస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆపస్‌ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు గల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆపస్‌ అధ్యక్షుడు శివరామ్‌ప్రసాద్‌, ప్రదాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు, కార్యదర్శి చలపతి, బి.శంకరం, సుబ్యమణ్యం, ఆనందరావు, ఎన్‌.సోమేశ్వరరావు, మహేష్‌, మన్మధ ప్రదాన్‌, భవానీశంకర్‌, నాగరాజు, శరత్‌, ఏ నాగేశ్వరరావు, సత్యానంద్‌, వెంకటరమణ, హేమంత్‌, జ్యోతిమహంకాళి, ధన లక్ష్మి, యశోద, ప్రమోదిని, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement