నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమో దు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా కార్య క్రమంలో గానీ లేదా మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో గానీ నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. రెవె న్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ కూడా సమాంతరంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.


