రుచి పోయింది
మేము ప్రతినెలా అరసవల్లి ఆదిత్యుని దర్శనానికి వస్తుంటాం. ప్రతిసారి 10 నుంచి 15 ప్యాకెట్ల పులిహోర ఇంటికి తీసుకెళ్తుంటాం. అయితే గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేదనిపిస్తోంది. పులిహోరలో జీడిపప్పు, శనగ పలుకులు పాడైనవి వస్తున్నాయి. దేవుని ప్రసాదానికి వంకలు పెట్టకూడదని తినేస్తున్నాం. కానీ నిజానికి పులిహోర రుచి పో యింది. నాణ్యమైన సరుకులు వాడడం లేదని తెలిసిపోతోంది. దేవుని ప్రసాదాల్లోనూ అక్రమాలు చేస్తున్న వారికి తగిన శాస్తి తప్పదు.
– వజ్రపు భాస్కరరావు,
తామరాపల్లి లక్ష్మణరావు, చీపురుపల్లి


