సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Feb 23 2026 6:53 AM | Updated on Feb 23 2026 6:53 AM

సర్వం

సర్వం సిద్ధం

● ఇంటర్‌ పరీక్షలకు

● నేటి నుంచే పరీక్షలు

● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం

● పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్‌ అమలు

● ప్రత్యేక రూట్లలో బస్‌ సదుపాయం కల్పన

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం/హిందీ పేపర్లకు పరీక్ష జరగనుంది. ఇంటర్‌ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం జరగనున్నాయి. 8.30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోపలికి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలకు 71 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు 34, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీ ఒకటి, 36 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలను కేంద్రాలగా ఎంపికచేశారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు.

31 స్టోరేజ్‌ పాయింట్లలో ప్రశ్న పత్రాలు..

జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకై 71 కేంద్రా లకుగాను అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు. జిల్లాకు ఇప్పటికే మూడు సెట్లతో కూడిన ప్రశ్న పత్రాలు చేరగా.. వీటిని 31 స్టోరేజ్‌ పాయింట్లలో పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచారు. పోలీసు పహారాను ఉంచారు. అన్ని కేంద్రాల్లోను సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. పరీక్ష జరిగే మూడు గంటల సీసీ కెమెరాల విడిధి(సమయాన్ని)ని పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి జిల్లా ఆర్‌ఐఓ కార్యాలయంలో అందజేయా ల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక రూట్లలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది.

వసతులన్నీ వైఎస్‌ జగన్‌ చలవే..

పరీక్షల ఏర్పాట్లలో అధికారులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించిన మనబడి నాడు –నేడు కార్యక్రమం ద్వారా వచ్చిన మౌలిక సదుపాయాలు నేడు పిల్లలకు వరంలా మారాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, వసతి కేంద్రాల్లో అదనపు భవనాలు, ఫర్నీచర్‌ ఉండడంతో పరీక్షలు సజావుగా జరిగిపోతున్నాయి.

పరీక్ష కేంద్రంలో హాల్‌టిక్కెట్‌ నంబర్లతో సిద్ధంగా ఉన్న ఫర్నీచర్‌

సీసీ కెమెరాను

సరిచేస్తున్న దృశ్యం

అంతా సహకరించాలి..

జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇంటర్‌బోర్డు సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు సీఎస్‌లు, డీఓలతో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. అన్ని మౌ లిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సిబ్బంది సహకరించి విజయవంతం చేయాలి. – రేగ సురేష్‌కుమార్‌, ఇంటర్మీడియెట్‌ బోర్డు, జిల్లా ఆర్‌ఐఓ, డీఈసీ కన్వీనర్‌

సర్వం సిద్ధం 1
1/3

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం 2
2/3

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం 3
3/3

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement