24న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు మొదలవుతాయని చెప్పా రు. జూనియర్ అండర్–18 విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా శ్రీకాకుళం జిల్లా నివాసి అయి ఉండాలని స్పష్టంచేశారు. ఆసక్తి గల వారు శాప్ వెబ్‌సైట్ స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ (sports.ap.gov.in)లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలను ఫిబ్రవరి 28వ తేదీన ఎన్.టి.ఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా తరఫున పంపిస్తామని మహేష్‌బాబు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 93903 52942, 9494814087 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
టెక్కలి: స్మార్ట్ మీటర్లతో నడిరోడ్డున పడనున్న మీటర్ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని మీటర్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు జీరు ప్రేమ్‌భూషన్‌రెడ్డి, బి.ఓంకారరావు డిమాండ్ చేశారు. ఆదివారం టెక్కలిలో జిల్లా స్థాయి మీటర్ రీడర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులతో పాటు తీవ్రంగా నష్టానికి గుర య్యే మీటర్ రీడర్స్ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో దశల వారీగా ఉద్యమాలు చేసినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల వల్ల జీవనోపాధి కోల్పోతున్న మీటర్ రీడర్స్‌కు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పొందర శ్రీనివాస్, దూగాన భాస్కర్, వండాన ప్రసాద్, పి.తులసీదాస్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సామూహిక ఉపనయనాలు
నరసన్నపేట: స్థానిక వెంకటేశ్వరాలయంలో ఆదివారం సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఒకేసారి 102 మంది యువకులు ఉపనయనాలు వేసుకున్నారు. శివమత వైశ్య యువకులకు గుండుగోల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో సత్యవరాగ్రహారానికి చెందిన రుత్వికులు శా స్త్రోక్తంగా యువకులతో పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. ఉపనయనాలు స్వీకరించిన యువకులు వారి కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా దీంట్లో బో యిన వెంకటరమణమూర్తి, పొట్నూరు సాయిబాబా, తంగుడు జోగారావు, రామసోమేశ్వరగుప్త తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఉచిత భోజన వసతులు కల్పించారు.


