సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ
ఇచ్ఛాపురం: నిషేధిత పదార్థాల అక్రమ రవాణా జరగకుండా చూడాలని శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి డి. శ్రీకాంత్ రెడ్డి స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బందికి సూచించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్‌పోస్ట్‌ని శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులకు చార్జిషీట్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పి.దుర్గాప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.


