అందని సహకారం
ఉద్యమ బాటలో సహకార ఉద్యోగులు
ఈ నెల 16 నుంచి 49 సొసైటీలకు తాళాలు
రోజుకు రూ. 5 కోట్ల లావాదేవీలకు బ్రేక్
ఆమరణ నిరాహార దీక్ష
రైతులకు ఇబ్బందులు పెడితే ఎలా?
●రాష్ట్ర వ్యాప్తంగా 36 జీఓ అమలు చేయాలి.
●2019–2024 పీఆర్సీ ఇవ్వాలి.. ఇవ్వలేని పక్షంలో 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలి.
●రూ.2 లక్షలు గ్రాడ్యూటీ సీలింగ్ ఎత్తివేసి యాక్ట్ ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలి.
●2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
●ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 వరకు పెంచాలి.
●సంఘాలు లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి.
●ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడంతో పాటు రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి.
ఇచ్ఛాపురం రూరల్:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 49 పీఏసీఎస్ కార్యాలయాల కు తాళాలు వేయడంతో ప్రతిరోజూ జరిగే సుమారు రూ.6 కోట్ల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో ఉన్న వేలాది మంది రైతులు అప్పు లు, విత్తనాలు, ఎరువులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు మూతపడటంతో పంట పనులకు అవసరమైన రుణాలు నిలిచిపోయాయి. కష్ట కాలంలో రైతులకు అండగా ఉండే సహకార రంగమే ఇప్పుడు మూగబోయింది. సమ్మె కారణంగా రైతులు ప్రైవేటు దళారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అధిక వడ్డీలు, అదనపు భారాలు రైతులపై పడుతున్నాయి.
జిల్లాలోని సొసైటీలో పనిచేస్తున్న 155 మంది రెగ్యులర్, 72 మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి ఉద్యోగులు విధులకు రావడం లేదు. దీంతో సింగిల్ విండో కా ర్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఒక్కో సొసైటీ లో రోజుకు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఇలా రోజుకు రూ.5 కోట్లకు పైగా లావాదేవీలకు బ్రేక్ పడింది. ప్రధానంగా క్రాప్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, రైతులకు ఎరువుల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు, రైతులు స్వల్పకాలిక పంట రుణాలు రెన్యువల్ తదితర సింగిల్ విండో కేంద్రంగానే సాగుతుంటాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో అన్ని పనులకు బ్రేక్ పడింది.
సహకార బ్యాంకు ఉద్యోగుల సమస్యలు, న్యా యమైన డిమాండ్లు తీర్చాలంటూ గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే విజయవాడ, గుంటూరులో వంటావార్పు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోమవారం నుంచి పీఏసీఎస్ కార్యాలయాలకు తాళాలు వేసి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ప్రభు త్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లేందుకు వెనుకాడబోము. .
– గిరిబుచ్చి రంగనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక సహకార కేంద్రం,శ్రీకాకుళం
సమస్యలు ప్రభుత్వం తీర్చే వరకు సొసైటీ తాళాలు తీయడం కుదరదంటూ సి బ్బంది కార్యాలయాలకు తాళాలు వేశారు. అటు ప్రభుత్వం వీరి సమస్యలపై స్పందించడం లేదు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. రైతు ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
– ఇసురు యాధవరెడ్డి, రైతు సంఘ
నాయకుడు, ఇచ్ఛాపురం మండలం
అందని సహకారం
అందని సహకారం


