సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.! | - | Sakshi
Sakshi News home page

సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.!

Feb 21 2026 6:53 AM | Updated on Feb 21 2026 6:53 AM

సర్వే

సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.!

సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.! ● భూమి రీ సర్వేకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే ● అప్పుడే తొలి విడతలో జిల్లాలో 738 గ్రామాల్లో సర్వే పూర్తి ● నాడు సర్వేపై విషం కక్కిన కూటమి నాయకులు ● నేడు అదే సర్వేను తిరిగి ప్రారంభించిన వైనం

● భూమి రీ సర్వేకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే ● అప్పుడే తొలి విడతలో జిల్లాలో 738 గ్రామాల్లో సర్వే పూర్తి ● నాడు సర్వేపై విషం కక్కిన కూటమి నాయకులు ● నేడు అదే సర్వేను తిరిగి ప్రారంభించిన వైనం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఉన్నవి లేనివి చెప్పి విషం చిమ్మాయి. అనుకూల మీడియా అండతో అసత్యాలు ప్రచారం చేశా యి. ఇప్పుడు అధికారం దక్కాక.. అదే రీ సర్వేను తిరిగి ప్రారంభించారు. నాడు వైఎస్‌ జగన్‌ చేసినది మంచి పనేనని వారే ఇప్పుడు రుజువు చేశారు. నాటి ప్రభుత్వం సరఫరా చేసిన డ్రోన్లు, బేస్‌ స్టేషన్లు, సర్వే గణన విధానం, ఎల్‌పీఎం నంబర్లు వంటివి అన్నీ ఫాలో అయిపోతున్నారు. నాడు ఇవే విధానాల ను వ్యతిరేకించి నేడు అవే విధానాలను అవలంబిస్తుండడంతో వారి రెండు నాలుకల ధోరణి బయటపడింది.

అధికారులు ఏమంటున్నారు..?

జిల్లాలో భూముల రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను తక్షణమే సరిదిద్దాలని, ప్రస్తుతం జిల్లాలో 4వ దశ రీ–సర్వే 167 గ్రామాల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిబ్రవరి 16 నాటికి 24 గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగిలిన 143 గ్రామాల్లో సర్వే పనులను చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 29,953 సర్వే నంబర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ భూములు విస్తీర్ణం 7,709.22 ఎకరాలుగా ఉందని అంచనాలు వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,74,941 ఎల్‌పీఎంలలో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

రాష్ట్రంలో దశాబ్దాలుగా భూములు సర్వేను నోచుకోలేదు. ఎన్నో ఏళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. వీటిని చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీ భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టింది. రైతు మేలు చేయాలని ఎన్నో పథకా లు తీసుకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆర్థిక భారం ఉన్నా రీ సర్వేను మొదలుపెట్టారు. అప్పట్లోనే 738 గ్రా మాల్లో సర్వే పూర్తి చేశారు. అధికారులకు శిక్షణ తో పాటు కావాల్సిన పరికరాలు అంటే డ్రోన్‌లు, కంప్యూటర్లు, బేస్‌ స్టేషన్లు, ఇతర పరికరాలు అందజేశారు. ఆధునిక విధానంలో సర్వే చేయించారు. జిల్లాలో మొత్తం 1465 రెవెన్యూ గ్రామా లు ఉండగా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందుగానే 738 రెవెన్యూ గ్రామాల్లో విజయవంతంగా రీ సర్వే పూర్తి చేసింది. 2,54,216 పట్టాదారు పాస్‌ పుస్తకాలను కూడా రైతులకు అందజేశారు.

సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.! 1
1/1

సర్వేశా.. ప్రజలంటే అంత అలుసా.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement