ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశా ఖ అధికారి ఎ.రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల 13 ఆదర్శ పాఠశాలలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు కలవో ఆ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగిన విద్యార్థులు www.cpe.ap. gov.inapmr.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ రుసుం రూ.125 ఓసీ, బీసీ విద్యార్థులకు ప్రవేశ రుసుం రూ.200 చెల్లించాలన్నారు.
జలుమూరు: శివరాత్రి ఉత్సవాలు అనంతరం శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 4,14,818 వచ్చిన ట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు శుక్రవారం తెలిపారు. ఇందులో ప్రత్యేక దర్శనం, కేశఖండన, హుండీవి కలిపి ఆదాయం లెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ ప్రసాద్ పాడి, సిబ్బంది, అర్చకులు ఉన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న జ్ఞానసాయి ఉన్నత ప్రతిభ కనబరచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఎంఈఓలు దేవేంద్రరావు, పద్మనాభరావు విద్యార్థిని స్థానిక ఎమ్మార్సీలో శుక్రవారం సత్కరించారు. ఇటీవల అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో నిర్వహించిన శిక్షణలో జ్ఞాన సాయి ప్రతిభ కనబరచడం సంతోషకరమని అన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉమ్మడి జిల్లాలోని టెక్కలి, రాజాం, శ్రీకాకుళం (ఎకై ్సజ్ కోర్టు) కేంద్రాల్లో ఖాళీగా ఉన్న రెండో తరగతి ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎంపికై న వారికి నెలకు రూ.45వేలు గౌరవ వేతనంతో పాటు రూ.5 వేలు వాహన భత్యం కలిపి మొత్తం రూ.50 వేలు వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ఐదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు, రిటైర్డ్ జ్యుడీషియల్ అధికారులు గతంలో మేజిస్ట్రేట్ అధికారాలు నిర్వహించి లా డిగ్రీ కలిగిన వి శ్రాంత గెజిటెడ్ అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ https://srikakulam. dcourts.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో జతపరిచి, మార్చి 17 సాయంత్రం 5 లోపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, శ్రీకాకుళం వారికి రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలని కోరారు.
ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


