బంగారం లాంటి మనసు | - | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి మనసు

Feb 21 2026 6:53 AM | Updated on Feb 21 2026 6:53 AM

బంగార

బంగారం లాంటి మనసు

బంగారం లాంటి మనసు

శ్రీకాకుళం అర్బన్‌: ఒక చైన్‌, నాలుగు ఉంగరాలు, ఒక జత చెవి దుద్దులు.. అన్నీ బంగారంవే. మొత్తం కలిపి 5 తులాలు. పోయాయి అనుకున్న ఆభరణాలను ప్రయాణికుడికి సురక్షితంగా అప్పగించి ఆర్టీసీ సిబ్బంది తమ ‘బంగారం’ లాంటి మనసును చాటుకున్నారు. సంతబొమ్మాళి మండలం సీతానగరంనకు చెందిన గుడియా సంతోష్‌కుమార్‌ తన కు టుంబ సభ్యులతో సోంపేట నుంచి పలాసకు వెళ్లేందుకు విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరారు. దారిలో పనిమీద కు టుంబ సభ్యులతో సహా హరిపురంలోనే దిగిపోయారు. ఆ హడావుడిలో బ్యాగ్‌ మర్చిపోయారు. కొంతదూరం వెళ్లాక బ్యాగు గుర్తుకు వచ్చింది. దీంతో బస్సులో టికెట్‌ నంబర్‌ ఆధారంగా డ్రైవర్‌ సంతోష్‌కు ఫోన్‌ చేసి బ్యాగు విషయం చెప్పారు. ఆయ న అప్రమత్తమై వెతకగా బ్యాగు దొరికింది. దీంతో బ్యాగ్‌ను భద్రపరచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎస్‌ఎం ఎంపీ రావునకు అందజేశారు. బ్యాగ్‌ పోగొ ట్టుకున్న గుడియా సంతోష్‌కుమార్‌ సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి ఎస్‌ఎం ఎంపీ రావును కలిశారు. బ్యాగ్‌లో ఉన్న వస్తువులు చెప్పారు. ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు కూడా చూపించారు. ఆ బ్యాగ్‌ సంతోష్‌కుమార్‌దేనని ఎస్‌ఎం ఎంపీ రావు నిర్ధారణ చేసుకుని ఆ బ్యాగ్‌ను ఆర్టీసీ సెక్యూరిటీ గార్డుల సమక్షంలో అందజేశారు. దీంతో గుడియా సంతోష్‌కుమార్‌ ఆ బస్‌ డ్రైవర్‌ బీవీఆర్‌ సంతోష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బంగారం లాంటి మనసు 1
1/2

బంగారం లాంటి మనసు

బంగారం లాంటి మనసు 2
2/2

బంగారం లాంటి మనసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement