మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి

Feb 21 2026 6:49 AM | Updated on Feb 21 2026 6:49 AM

మీ హా

మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి

మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి ● ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌ ద్వారా పొందే సదుపాయం ● 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బృహత్తర ఆలోచనకు శ్రీకారం ● ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల స్టాంప్‌ అవసరం లేదు ● 23 నుంచి మొదలుకానున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు

● ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌ ద్వారా పొందే సదుపాయం ● 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బృహత్తర ఆలోచనకు శ్రీకారం ● ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల స్టాంప్‌ అవసరం లేదు ● 23 నుంచి మొదలుకానున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు

శ్రీకాకుళం న్యూకాలనీ:

త వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చి న సంస్కరణలు ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల కు హాజరయ్యేందుకుగాను హాల్‌టికెట్లకు సంబంధించి తీసుకొచ్చిన బృహత్తర ఆలోచన ముఖ్యంగా కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు వరంలా మారింది. ఫీజు బకాయిల పేరుతో హాల్‌ టికెట్‌ ను కళాశాలల యాజమాన్యాలు నిరాకరించేందుకు వీల్లేకుండా విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునే లా ఇంటర్మీడియెట్‌ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఈ పరీక్షలకు 39838 మంది విద్యార్ధులకు హాజరుకానున్నారు. కొన్నిచోట్ల ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు హాల్‌ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఏటా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో జరిగిన ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల కు సమయంలో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులే నేరుగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకావచ్చని ఆదేశించడంతో విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూర్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలోచనే ప్రస్తుత సర్కారు అమలు చేస్తుంది. విద్యార్థుల హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి టెన్త్‌ హాల్‌ టిక్కెట్‌ నంబరును నమోదుచేస్తే ఇంటర్‌ హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెకెండియర్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సర హాల్‌ టికెట్‌ నంబ రు, ఆధార్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌ టికెట్‌ పొందవచ్చు.

‘వాట్సాప్‌’ ద్వారా డౌన్‌లోడ్‌..

మనమిత్ర వాట్సాప్‌ ద్వారా సైతం విద్యార్థులు హాల్‌టికెట్లు పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్‌ నంబరు 9552300009 కు ‘ఏజీ’ అని మెసే జ్‌ పంపడం ద్వారా హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సంతకం లేదా.. నో ప్రాబ్లమ్‌!

ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు పొందిన విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు పరీక్షల షెడ్యూల్‌, సబ్జెక్టుల వివరాలను సరి చూసుకోవాలి. దానిపై ప్రిన్సిపాల్‌ సంతకం, కళాశాల స్టాంప్‌ అవసరం లేకుండా నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరు కావచ్చు.

మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి 1
1/1

మీ హాల్‌టికెట్‌.. మీరే డౌన్‌లోడ్‌ చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement