విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి

Feb 21 2026 6:49 AM | Updated on Feb 21 2026 6:49 AM

విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి

విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి

విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణానికి కృషి

పలాస : దేశంలో హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు భూస్వామ్య సంస్కృతి పెచ్చుమీరుతోందని, దీనికి ప్రత్యామ్నాయంగా శ్రామికవర్గ సంస్కృతి, సాహిత్యం, కళలతో కూడిన విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణం జరగాలని, అందుకు అరుణోదయ సంస్థ కృషి చేయాలని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌ అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో శుక్రవారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సొర్ర రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సన్నశెట్టి మాట్లాడుతూ అరుణోదయ కళాకారులకు దశ దిశాను నిర్దేశించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు వంకల మాధవరావు, తాండ్ర ప్రకాష్‌, మామిడి కోదండరావు, ఎం.వినోద్‌కుమా ర్‌, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, జుత్తు వీరాస్వామి తమ సందేశాలను వినిపించారు. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారందరిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రజా కళలను ప్రజలపరం చేయాలని కోరా రు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సొర్ర రామారావు, ప్రధా న కార్యదర్శిగా కె.సోమేశ్వరరావు, కార్యదర్శిగా డి. సింహాచలం, కోశాధికారిగా బొమ్మాళి బాలకృష్ణ, మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నా రు. సాంస్కృతిక ఉద్యమంలో అనుభవశాలి మా ర్పు మల్లేశ్వరరావును గౌరవ అధ్యక్షునిగా జనరల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిజ్ఞ అనంతరం గాయకులు విప్లవ గీతాలతో సమావేశాన్ని ఉత్తేజపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement