ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి గిరిజనుల సమస్యలు
సారవకోట: జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన ఐక్యవేదిక నాయకులు మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడేళ్ల క్రితం గిరిజనుల కోసం భవనం నిర్మించినా ఇంతవరకు గిరిజనులకు అప్పగించలేదన్నారు. కొత్తూరు మండలం కారిగూడ పాఠశాలలో నకిలీ బీఈడీ సర్టిఫికెట్లతో ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు చౌదరి లక్ష్మినారాయణ, బరండి గోపాలరావు, చింతపల్లి రామారావు తదితరులున్నారు.


