47
దయనీయంగా వంశధార ఎడమ కాలువ
ప్యాచ్ వర్కులతో సరిపెడుతున్న అధికారులు
పాడైన షట్టర్లు, డిిస్ట్రబ్యూటర్లు,
రెగ్యులేటర్లు
పూర్తిగా ధ్వంసమైన స్ట్రక్చర్లు
గడ్డివాములు, ఇసుక బస్తాలతో
నీటిమళ్లింపు
ప్రభుత్వానికి నివేదించాం..
ఆ కాలువకు..
ఏళ్లు!
హిరమండలం : జిల్లాను సస్యశ్యామలం చేస్తూ అపర భగీరథిగా నిలుస్తున్న గొట్టా బ్యారేజీ నిర్మాణం దాదాపు ఐదు దశాబ్దాల కిందట చేపట్టారు. అప్పటి సాగునీటి అవసరాలకు తగ్గట్టు కాలువలు నిర్మించారు. ముందుగా నిర్మాణం చేపట్టిన ఎడమ ప్రధాన కాలువ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కాలువ బాగోగులు పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికై నా బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. 1978లో గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాలువ తవ్విన నాటి నుంచి ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టిన దాఖలాలు లేవు. నేతల జేబులు నింపేలా నీరు–చెట్టు పనులు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదినక పనులు చేపట్టడం లేదు. ఎడమ ప్రధాన కాలువ అందుబాటులోకి వచ్చి 47 ఏళ్లు దాటడంతో దారిపొడవునా కాలువ దారుణంగా తయారైంది. కనీస నిర్వహణ లేక కాలువకు ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయి. షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అనుసంధాన పిల్ల కాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి.
అంతా అస్తవ్యస్తం..
సాధారణంగా చిన్నపాటి కాలువను నిర్వహణ లేక విడిచిపెడితేనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటిది జిల్లాలో సగం పంటకు సాగునీరు అందించే కాలువను పట్టించుకోకుండా వదిలేయడంతో పూర్తిగా ధ్వంసమైంది. కాలువపై స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయి. షట్టర్లు కొట్టుకుపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు, రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. 2,480 క్యూసెక్కుల నీటి సామర్థ్యం 1700 క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
రైతుల పాట్లు..
ఏటా ఖరీఫ్ వచ్చిందంటే చాలు.. కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు రైతులకు అదనపు పని తప్పడం లేదు. కర్ర చెక్కలు, ఇసుక బస్తాలు, గడ్డివాములు అడ్డుపెట్టుకొని నీరు మళ్లించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటోంది. 2022–23లో అప్పటి ప్రభుత్వం రూ.954 కోట్ల అంచనాలతో ఆధునీకరణ పనులు చేపట్టాలని భావించింది. ఇంతలో గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణం, వంశధార–నాగావళి అనుసంధానంతో ఆధునీకరణ అంశం పక్కకు వెళ్లింది. అయితే ఇప్పుడు రూ.1600 కోట్లతో అధికారులు కొత్త ప్రతిపాదనలు చేశారు. దీనిపై జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణకు సంబంధించి తాత్కాలిక అంచనాలు రూపొందించాం. ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపడుతున్నాం. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
– ఎం.మురళీమోహన్ ఈఈ నరసన్నపేట
డివిజన్ , బిఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు
47
47
47
47
47


