రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’
అందరి సహకారంతోనే..
● కార్పొరేట్‌కు దీటుగా రాణిస్తున్న జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు ● విద్యతో పాటు అన్ని అంశాల్లోనూ రాణింపు ● తాజాగా షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపిక
జి.సిగడాం: కార్పొరేట్‌కు దీటుగా బోధనతో వివిధ రంగాల్లో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తూ రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది జి.సిగడాం మోడల్ స్కూల్. ఇక్కడి సీటు కోసం ఏటా తీవ్రస్థాయిలో పోటీ ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణం, మౌలిక సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్య ఇక్కడి ప్రత్యేకతలు. జి.సిగడాం మండల కేంద్రంలో ఉన్న ఈ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఏటా ఉత్తమ ఫలితాలు..
గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ పాఠశాలలకు గాను 75 –99 శాతం ఉత్తీర్ణత సాధించిన ఐదు స్కూళ్లలో జి.సిగడాం మోడల్ స్కూల్ ఒకటి. 98 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు 97 మంది ఉత్తీర్ణులై 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో 92 మంది ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.
షార్ట్‌ఫిల్మ్ పోటీలో..
విద్యుత్ ఆదాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ‘అత్తా కోడళ్ల పవర్’ అనే లఘుచిత్రం రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపికై ంది. ఈ నెల 20న రాష్ట్ర అధికారులు, నాయకుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ చిత్రానికి తెలుగు భాషా పండితులు కోట తిరుపతిరావు గైడ్‌గా వ్యవహరించారు.
విద్యాలయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడన విద్య అందిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో వివిధ లఘుచిత్రాలను తీసి అధికారులకు పంపించాం. వాటికి బహుమతులు రావడం ఆనందంగా ఉంది.
– కోట తిరుపతిరావు, తెలుగు అధ్యాపకులు, జి.సిగడాం మోడల్ స్కూల్
రాష్ట్రస్థాయిలో జరిగిన విద్యుత్ ఆదా పోటీలో అత్తా కోడళ్లు పవర్ లఘుచిత్రం బహుమతికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విద్యాలయంలో అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. తల్లిదండ్రుల సహకారం కూడా మరువలేనిది.
– డబ్బీరు గణేష్‌పట్నాయక్,
ప్రిన్సిపాల్, జి.సిగడాం మోడల్ స్కూల్
రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’
రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’
రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’


