పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం టెక్కలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. కొన్ని సంఘాలు జీపీఎస్, యూపీఎస్ ప్రపంచంలోనే అత్యున్నతమైనవంటూ ప్రశంసించడం దారుణమన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు బి.బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, కృష్ణ, రోహిణేశ్వరరావు, చక్రవర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


