జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు. పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ ధర్మాల నూకరాజు అతని యూనిట్‌తో పాటు 2023లో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో విధులు నిర్వహించాడు. ఆ ఏడాది అక్టోబర్‌లో హిమనదీయ సరస్సుకి వచ్చిన వరదల కారణంగా సరస్సు పై నిర్మించిన చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకు పోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్మీయూనిట్ రిస్కీ ఆపరేష్ నిర్వహించి సహాయ సహకారాలు అందించారు. జవాన్లు చేసిన సేవలను గుర్తించిన డిప్యూటీ చీఫ్ ఆప్ ఆర్మీ ఆదివారం ప్రశంసాపత్రాన్ని సీఓ రాహుల్‌సింగ్ ద్వారా బెంగాల్ ఆర్మీ యూనిట్ వద్ద అందజేసినట్లు జవాన్ తెలిపారు.


