రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెలన 16న ‘భారత రాజ్యాంగం – రాజ్యాంగ వ్యవస్థల కాషాయకరణ’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలోని ఆదివారంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు, డి.గణేష్, నేతల అప్పారావు, యడ్ల జానకిరావు, బోనెల చిరంజీవి, చంద్రమౌళి, అనిల్, రామారావు, కై లాష్, అప్పన్న, శ్రీను పాల్గొన్నారు.


