
ఏఓ‘బీ.. కేర్‌ఫుల్’!
● సరిహద్దులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
● చెక్‌పోస్టులు లేకపోవడంతో అక్రమంగా తరలింపు
● ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రాలో అమ్ముతున్న వైనం
● రాత్రిపూట హల్‌చల్ చేస్తున్న
మందుబాబులు
కొత్తూరు: ఆంధ్రా ఒడిశా బోర్డర్ అక్రమ మద్యం రవాణాకు చిరునామాగా మారింది. సరిహద్దులో చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో మత్తు పదార్థాల రవాణాకు అనుకూలంగా మారింది. జిల్లాలో సరిహద్దు గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తూ ఇక్కడ విక్రయిస్తున్నారు. కొత్తూరు మండలంలోని బలద, కడుము, కౌశల్యాపురం, దిమిలి, రాయల, మాతల, నివగాంతో పాటు జిల్లాలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న మండలాలకు చెందిన గ్రా మాల్లో ఒడిశా మద్యం ఏరులై పారుతోంది. దీంతో రాత్రిళ్లు కూడా మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు విషయం తెలిసినా ఏమీ అనడం లేదు. స్థానిక పోలీసులకు సమాచా రం ఉన్నా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో ఒడిషా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు జిల్లాలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. అందులో భాగంగా కొత్తూరు మండలంలో ఈ ఆగస్టు 11వ తేదీన బలద గ్రా మంలో ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్న బెల్టు షా పుల్లో ఒడిషా మద్యం పట్టుకున్నారు. స్థానిక ఎకై ్సజ్, పోలీసులు మాత్రం ఎలాంటి దాడులు చేయడం లేదు. బోర్డర్‌లోని ఆంధ్రాకు చెందిన ప్రతి గ్రామంలోని పాన్‌షాపుల్లోనూ మద్యం దొరుకుతోంది. రాత్రి ఏ సమయంలో కావాలన్నా వీరు మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రి పూట మందు బాబులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
తనిఖీలు నిర్వహిస్తున్నాం
ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లోని పల్లెల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఒడిశా మద్యం ఆంధ్రా గ్రామా ల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులకు వెళ్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. బెల్టుషాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటాం.
– కిరణ్మీశ్వరి, సీఐ, ఎకై ్సజ్ స్టేషన్, కొత్తూరు