నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

Sep 19 2025 3:08 AM | Updated on Sep 19 2025 3:08 AM

నేడు

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు వన్‌స్టాప్‌ సెంటర్‌ సేవలపై ఆరా లారీ డ్రైవర్‌కు గాయాలు పథకాలపై అవగాహన అవసరం సంస్కృతం సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు శుక్రవారం జరగనున్నాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 2011 జనవరి ఒకటి తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని చెప్పారు. ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్‌ 4 నుంచి 6 వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌ బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2025 పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌/శ్రీకాకుళం: శ్రీకాకు ళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగం, వన్‌ స్టాప్‌ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు గురువారం సందర్శించారు. రోగులను పరామర్శించి, వారికి అందిస్తున్న వైద్య సేవ లు, పౌష్టిక ఆహార సరఫరా, ఆస్పత్రి పరిసరా ల పరిశుభ్రతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డాక్టర్‌ డి.విజయలక్ష్మి, టి.అలేఖ్య పాల్గొన్నారు.

ఎచ్చెర్ల : కేశవరావుపేట వద్ద జాతీయ రహదా రిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్‌ చెందిన లారీ డ్రైవర్‌ రామ్‌నాథ్‌సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి విశాఖపట్నం పోర్టుకు వెళ్తు కంటైనర్‌ లారీ కేశవరాపుపేటకు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న మరో లారీ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: యువత, మహిళా సంఘాలకు ప్రధాన మంత్రి రైతు నిధి, ఆయుష్మాన్‌ భారత్‌, నైపుణ్య భారతం వంటి ప్రధాన పథకాలపై అవగాహన అవసరమని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకుడు పి.కిరణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మేరా యువ భారత్‌ ఉప సంచాలకుడు కె.వెంకట్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ ఆరోగ్య భారత్‌–ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి రుణ పథకం, డిజిటల్‌ భారత్‌ కార్యక్రమాలు, నైపుణ్య భారతం, స్వచ్ఛ భారత్‌, ప్రతి ఇంటికీ నీరు పథకం, విశ్వకర్మ యోజన, స్టాండ్‌ అప్‌ ఇండియా, ఉజ్వల యోజన, బిడ్డను చదివించు–బిడ్డను కాపాడు వంటి పథకాలను వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ప్రధాన అధికారి జి.ఎం.శ్రీధర్‌, నాబార్డ్‌ సహాయ ప్రధాన అధికారి కె.రమేష్‌కృష్ణ, లీడ్‌ బ్యాంకు అధికారి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు సంచాలకుడు ఆర్‌.శ్రీనివాసరావు, సెట్‌శ్రీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి వి.వి.అప్పలనాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌, స్వీప్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కొమ్ము రమణమూర్తి, స్పందన సంస్థ అధ్యక్షుడు పొన్నాడ కష్ణారావు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మేర యువ భారత్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

ఎచ్చెర్ల : పీఎం ఉష నిధులు సహకారంతో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో సంస్కృతంలో సర్టిఫికెట్‌ కోర్సును గురువారం వైస్‌ చాన్సలర్‌ కె.ఆర్‌.రజనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం నుంచే హిందీ తదితర భాషలన్నీ ఉద్భవించాయని చెప్పారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య మాట్లాడుతూ సంస్కృతం నేర్చుకుని విద్యార్దులు మంచి భవిష్యత్తులో స్థిరపడాలని అన్నా రు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.అనూరాధ, ప్రోగ్రామ్‌ సమన్వయకర్త డాక్టర్‌ టి.సంతోషి, పావని, తెలుగు భాషా విభాగం సమన్వయకర్త డాక్టర్‌ పి.లక్ష్మణరావు, ఎన్‌.లోకేశ్వరి, కె.ఉదయ్‌కిరణ్‌, బలరాం నాయుడు, ఎం.ప్రకాష్‌రావు, పి.రవికుమార్‌ పాల్గొన్నారు.

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల  ఎంపికలు   1
1/2

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల  ఎంపికలు   2
2/2

నేడు జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement