
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
అరసవల్లి: శ్రీకాకుళం పాతబస్టాండ్‌లోని పెద్ద మార్కెట్ వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా స్తంభం ఒరిగిపోయి వైర్లు తెగి పడ్డాయి. జనసంచా రం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ంది. ఈ ఘటనతో పాతబస్టాండ్ పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేయించి వేకువజామున విద్యుత్ సరఫరా అందించా రు. తాగిన మత్తులో ట్రాక్టర్‌ను నడిపి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమానిపై సంబంధిత విద్యుత్ శాఖ, మున్సిపల్ కార్పోరేషన్, ట్రాఫిక్ పోలీసు లు గానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. స్థానిక రాజకీయ నేతల జోక్యంతోనే ప్రమాద ఘటనకు కారకులను విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.