
ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంపీ లాడ్స్ నిధులు సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం ఎంపీ లాడ్స్, జాతీయ రహదారుల, జల జీవన్ మిషన్ పథకాలపై సమీక్ష నిర్వహించా రు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ సంవత్సరం ప్రారంభించి న కార్యక్రమం.. అదే సంవత్సరం ముగించాలి అనే విధానంలో ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నా మని చెప్పారు. కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి ఆనుకొని ఆరు లైన్ల జాతీయ రహదారి రానుందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టును రానున్న జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా పరిధిలో 180 కిలోమీటర్లకు పైగా ఉన్న జాతీయ రహదారిలో అనేక బ్లాక్ స్పాట్‌లను గుర్తించామని, వాటి వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో జల జీవన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే.. శ్రీకాకుళం పరిస్థితి మరింత దారుణంగా ఉందని మంత్రి తెలిపారు. ఉద్దానం ప్రాజెక్ట్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.