ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కోసం ఆటోడ్రైవర్ల పాట్లు
సిబ్బంది అదనపు వసూలు చేస్తున్నారని ఆవేదన
పట్టించుకోని ఆర్టీఏ అధికారులు
ఒక్క సర్టిఫికెట్..
శ్రీకాకుళం రూరల్ : జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆస్పత్రి నుంచి వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫిట్‌నెస్ కేంద్రం (వైదంతి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) నిర్వాహకులు ఆటోడ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సవాలక్ష కండీషన్లు పెడుతున్నారు. వాహనా లు బట్టి వేల రూపాయల్లో వసూళ్లు చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహన మిత్ర పథకానికి కీలకంగా మారిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యంతో బుధవారం రాత్రి వందలా ది ఆటోడ్రైవర్లు నరకయాతన పడిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. వందలకొద్దీ ఆటోలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం క్యూకట్టాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు డ్రైవర్లు చలానాలు తీసుకొని ఫిట్‌నెస్ కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది సవాలక్ష కండీషన్లు పెట్టి వెనక్కి పంపేశారు. గతంలో ఆర్టీఏ అధికారులు తమకు ఇలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు మంజూరు చేశారని చెప్పినా వినిపించుకోవడం లేదని పలువు రు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిట్‌నెస్ కేంద్రం ప్రైవేట్‌ప రం కావడంతో ఇష్టమొచ్చినట్లుగా దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు అడిగినంత సొమ్ము ముట్టచెప్పుకోవాల్సి వస్తోంది. అప్పులు చేసుకొని కమీషన్లు ఇవ్వాల్సి వస్తోంది.
– చిన్నారావు, ఆటో డ్రైవర్, గార
సవాలక్ష కండీషన్లు!