
పరిశోధనలతోనే ఉజ్వల భవిష్యత్
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశోధనలవైపు విద్యార్థులు దృష్టి సారిస్తే అద్భుతంగా రాణించగలుగుతారని మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా సమాజంలో సైన్స్ వైబ్రేషన్స్ పేరిట జరిగిన రెండు రోజుల సైన్స్ ప్రయోగాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. కళాశాల సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా.. ఇండిజీనియస్ సొసైటీ ఫర్ ప్రోగల్ సైన్స్ ఇన్వెన్షన్ సొసైటీ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ గొంటి గిరిధర్, వివిధ కళాశాలల అధ్యాపకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇలాంటి ఎగ్జిబిషన్‌తో శాసీ్త్రయ దక్పథం పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి నిర్వహనకర్త డాక్టర్ మదమంచి ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, ప్రొగ్రాం కోఆర్డినేటర్స్ డాక్టర్ రోణంకి హరిత, పి.సుధారాణి, శివాల రవిబాబు, కె.అపర్ణ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.