
గ్రానైట్ క్వారీతో ప్రశాంతత దూరం చేయొద్దు
మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వల్ల గ్రామం మట్టి దిబ్బలా మారిపోతుందని, ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇబ్బందులు చూస్తున్నామని, తమ గ్రామ పరిధిలో గ్రానైట్ క్వారీ ఏర్పాటు చేసి ప్రశాంతత లేకుండా చేయవద్దని మెళియాపుట్టి మండలం సుర్జిని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు దుర్గమ్మ కొండ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీలో తవ్వకాలు, రాళ్ల రవాణా వల్ల గ్రామం దుమ్ముధూళితో నిండిపోవడమే కాకుండా రాళ్లు ఇళ్లపై పడి ప్రమాదాలు జరగే అవకాశం ఉందన్నారు. ప్రశాంతంగాజీవిస్తున్న తాము నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ పాపారావుకు కార్యాలయంలో వినతిప త్రం అందించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారని చెప్పా రు. శక్తి మూగాంబికా క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బయటి గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ ముగించారని పేర్కొన్నారు. ప్రఽథమపౌరుడు గ్రామ సర్పంచ్ పెద్దింటి చంద్రరావుకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. నిరసన కార్యక్రమంలో కొర్ల కృష్ణమూర్తి, ఇప్పిలి రామారావు, ఢిల్లేశ్వరరావు, జన్ని రామారా వు, కొర్ల వేణు, కొర్ల లోకేశ్వరరావు, పైల కూర్మనా యకులు, కింతలి కిరణ్, రాంబాబు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.