
ఎన్నాళ్లో ఈ యాతన..?
● లక్ష్మీపురంలో గొడవ
కాళ్లు నొప్పులు పుట్టే వరకు నించుంటే గానీ బస్తా యూరియా దొరకడం లేదు. పనులన్నీ మానుకుని లైను కడితే గానీ చీటీలూ అందడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎరువుల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు ప్రతి ఊరులోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
● యూరియా కష్టాలు
పాతపట్నం మండలంలోని బూరగాం, ఆర్.ఎల్.పురం గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని రైతులకు తెలియటంతో గురువారం ఒకేసారి రైతు సేవా కేంద్రానికి ఆర్.ఎల్.పురం, రొమదల, రొంపివలస, నల్లబొంతు, ఎ.ఎస్.కవిటి, సీది, తీమర, బూరగాం, సీతారాంపల్లి, బొరుభద్ర గ్రామాలకు చెందిన రైతులు వచ్చి బారులు తీరారు.
– పాతపట్నం
● ఎదురు చూపులే..
మండలంలో యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గురువారం చెన్నాపురం, మాకివలస రైతు సేవా కేంద్రాల పరిధిలో యూరియా పంపిణీ చేశారు. చెన్నాపురానికి 200 బస్తాలు, మాకివలసకు 110 బస్తాలు వచ్చాయి. వచ్చిన యూరియా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో రైతులు పడిగాపులు కాశారు. ఇంత వరకూ యూరియా ఇవ్వని రైతులకు ఇద్దరు ముగ్గురేసి కలిపి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. –నరసన్నపేట
● తోపులాట
మండలంలోని మాతల, వసప గ్రామ సచివాలయాల వద్ద గురువారం యూరియా పంపిణీ చేశారు. మాతల గ్రామంలో ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. పోలీసులు వచ్చినా గందరగోళం ఆగకపోవడంతో పంపిణీ నిలిపివేశారు. చివరకు తహసీల్దార్ కె.బాలకృష్ణ, ఏఓ స్వర్ణలతలు మాతల చేరుకొని ఇంత వరకు పూర్తిగా యూరియా అందని రైతులను గుర్తించి వారికి అందజేశారు. –కొత్తూరు
పలాస: పలాస మండలం లక్ష్మీపురం రైతు సేవా కేంద్రం వద్ద గురువారం యూరియా కోసం అధికారులతో రైతులు గొడవ పడ్డారు. గతంలో ఈ రైతు సేవా కేంద్రానికి 200 బస్తాల యూరియా వచ్చింది. ఇప్పుడు తాజాగా గురువారం మరో 220 బస్తా యూరియా వచ్చింది. దీంతో సచివాల యం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంతో పాటు గరుడఖండి, పాతజగద్దేవుపురం, సరియాపల్లి, గోపాలపురం తదితర గ్రామాల రైతులకు ఈ యూరియా అందరికీ సమానంగా ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఒక ఎకరాకి ఒక బస్తా అని చెప్పినప్పటకీ ఆ విధంగా ఇవ్వకుండా కేవలం లక్ష్మీపురం రైతులకే మొత్తం యూరియా ఇస్తున్నారని, మిగతా గ్రామాలకు యూరియా ఇవ్వడం లేదని రైతులు బూర్లె నరిసింహులు, అంపోలు రాజారావు, బూర్లె మహేష్, ఎంపీటీసీ గొండు మోహనరావు తదితరులు అధికారులను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు మొత్తం యూరియా ఇస్తున్నారని, మిగతా వారికి ఇవ్వడం లేదని ఎంపీటీసీ మోహనరావు పలాస తహసీల్దార్ దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో తాత్కాలికంగా యూరియా పంపకాన్ని ఆపారు

ఎన్నాళ్లో ఈ యాతన..?

ఎన్నాళ్లో ఈ యాతన..?

ఎన్నాళ్లో ఈ యాతన..?

ఎన్నాళ్లో ఈ యాతన..?

ఎన్నాళ్లో ఈ యాతన..?